వచ్చే నెలయినా పింఛను ఇంటివద్ద చెల్లిస్తారా?
జూన్ 1న ఇళ్ల వద్దే పింఛన్ అందజేయాలని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు
జూన్ 1న ఇళ్ల వద్దే పింఛన్ అందజేయాలని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. గత రెండు నెలల నుంచి పింఛను దారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత రెండు నెలలు నుంచి పెన్షనర్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, ఏప్రిల్, మేలో పదుల సంఖ్యలో వృద్ధుల మరణాలకు కారణమయ్యారని దేవినేని ఉమ ఆరోపించారు.
వృద్ధుల మరణానికి...
జూన్ నెల ఫింఛను అయినా సచివాలయ సిబ్బంది సాయంతో పింఛన్లు ఇంటి వద్దే అందించాలని దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వృద్ధుల మరణానికి కారకులైన అధికారులు మూల్యం చెల్లించుకోకతప్పదని మాజీ మంత్రి దేవినేని ఉమ హెచ్చరించారు. కావాలనే ప్రభుత్వం వృద్ధులను ఇబ్బందిపెట్టిందని ఆయన ఆరోపించారు.