TDP : సమస్యాత్మక నియోజకవర్గాల్లో పులివెందుల ఏదీ?
డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు
డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి టీడీపీ నేత కనకమేడల రవీంద్రకుమార్ విజ్ఞప్తి చేశారు. వీరిద్దరినీ బదిలీ చేసి రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి అబ్జర్వర్లను పంపించి ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండేలా చూడాలని కోరారు. సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాలను గుర్తించి స్పెషల్ ఫోర్స్ ఇవ్వాలని కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. 14 నియోజకవర్గాలను మాత్రమే సమస్యాత్మక ప్రాంతాలుగా ఈసీ గుర్తించిందని, దురదృష్టమేంటంటే సమస్యాత్మక ప్రాంతాల్లో పులివెందుల లేదన్నారు.
కుప్పంలోనూ...
కుప్పంలో హింసాత్మక ఘటనలు చేస్తూ వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నామని, హింసాత్మక ఘటనల ప్రాంతాలనూ సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని ఆయన ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోరారు. సమస్యాత్మక ప్రాంతాలకు కేంద్ర బాలగాలను తరలించి ఎన్నికలు నిర్వహించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణంతా వెబ్‍కాస్టింగ్ చేయాలన్నారు. స్వేచ్ఛగా ఓట్లు వేసుకొవచ్చని ప్రజలకు ఈసీ భరోసా కల్పించాలని కనకమేడల రవీంద్రకుమార్ మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు.