దేశమంతా ఒకే పెట్రోలు ధర ఉండేలా?
రాజధానిగా అమరావతిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.;
రాజధానిగా అమరావతిని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన రాజధాని అక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. పెట్రోలు ఉత్పత్తులపై ఏపీ ప్రభుత్వం తగ్గించలేదని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దేశమంతా పెట్రోలు, డీజిల్ ధరలు ఒకేలా ఉండేలా ఏకీకృత నిబంధనలు తీసుకు వచ్చేలా చూడాలని కోరామన్నారు.
వరద సాయాన్ని...
ిఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరామని గల్లా జయదేవ్ చెప్పారు. విభజన చట్టంలో పొందు పర్చిన హామీలను నెరవేర్చాలని కోరామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనను మానుకోవాలని తాము సమావేశంలో తెలిపినట్లు జయదేవ్ తెలిపారు. వరద సాయాన్ని వెంటనే అందచేయాలని కోరామన్నారు.