Gorantla : ఎక్కడికి వచ్చేది జగన్.. రాజమండ్రి జైలుకే

టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-03-25 07:29 GMT
gorantla butchayya chowdhury, senior leader, tdp, sensational comments

tdp mla gorantla butchaiah chaudhary 

  • whatsapp icon

టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‍పై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంతో చంద్రబాబు, పవన్ అంతర్గతంగా మాట్లాడుతున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. ఎన్డీఏ కూటమిలో ఉన్నందున బహిరంగా మాట్లాడలేమన్న గోరంట్ల జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

జైలు ఊచలను లెక్కించాల్సిందేనంటూ...
మూడేళ్ల తర్వాత జగన్ అధికారంలోకి వస్తానంటున్నారని, జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకేనంటూ గోరంట్ల బుచ్చయ్యచౌదరి మరో కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్, మైనింగ్ స్కామ్‍లు బయటకు వస్తున్నాయన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మళ్లీ జైలు ఊచలను జగన్ లెక్కించాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News