నేడు ఇన్‌ఛార్జులతో చంద్రబాబు సమావేశం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తున్నారు. నేడు మూడు నియోజకవర్గాల నేతలతో సమీక్షించనున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, కృష్ణా జిల్లా గుడివాడ, కడప జిల్లా బద్వేలు నియోజకవర్గాల సమీక్ష ను ఆయన ఈరోజు నిర్వహిస్తున్నారు.
మూడు రోజుల నుంచి...
మూడు రోజుల నుంచి చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు ప్రారంభించారు. నేతలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం, నియోజకవర్గంలో సమస్యలపై పోరాటాలు చేయాలని ఆదేశించడం చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా నేతలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో జరుగుతున్న ఈ సమావేశంలో పనితీరును మెరుగుపర్చుకోవాలని కొందరికి క్లాస్ పీకుతున్నట్లు సమాచారం.