Nara Bhuvaneswari : మళ్లీ ప్రజల్లోకి నారా భువనేశ్వరి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.;

Update: 2024-01-02 05:10 GMT
Nara Bhuvaneswari : మళ్లీ ప్రజల్లోకి నారా భువనేశ్వరి
  • whatsapp icon

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ఆమె పర్యటనలు ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు భువనేశ్వరి మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. "నిజం గెలవాలి" అనే పేరుతో ఆమె పర్యటనలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నిజం గెలవాలి....
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టయిన తర్వాత ఆ వార్త తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్నారు. చంద్రబాబు జైల్లో ఉండగానే ఈ పర్యటనలు ప్రారంభించారు. అయితే ఆమె విజయనగర జిల్లా పర్యటనలో ఉండగా చంద్రబాబుకు బెయిల్ లభించడంతో అప్పటికి పర్యటనకు తాత్కాలికంగా విరామాన్ని ప్రకటించారు. మరోసారి ఉత్తరాంధ్రలో రేపటి నుంచి పర్యటించేందుకు నారా భువనేశ్వరి సిద్ధమయ్యారు.


Tags:    

Similar News