Breaking : చంద్రబాబుకు షాక్.. బెయిల్ పిటీషన్లు డిస్మిస్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. అంగళ్లు, ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఈ మూడు కేసుల్లో చంద్రబాబు వేసిన పిటీషన్లపై హైకోర్టులో వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
మూడు కేసుల్లోనూ...
అయితే ఇప్పుడు ఈ మూడు కేసుల్లోనూ హైకోర్టు తీర్పు చెప్పింది. అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి మూడు ముందస్తు బెయిల్ పిటీషన్లను హైకోర్టు కొట్టివేయడంతో ఇప్పుడు దీనిపై విచారించేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ తీర్పులతో తెలుగుదేశం పార్టీ డీలా పడింది. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో ఇప్పటికే నెల రోజుల నుంచి జైలులో ఉన్న చంద్రబాబుకు ఈ తీర్పు షాక్ ఇచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది.