వీళ్లను పశువులతో కూడా పోల్చలేం

రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు తీర్పు పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు.;

Update: 2022-03-03 14:48 GMT

రాజధాని అమరావతి అంశంపై హైకోర్టు తీర్పు పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. హైకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. రాజధాని విషయంలో జగన్ ఎందుకు మాట తప్పారో ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. తాడేపల్లి లో ఇల్లు కట్టుకుని ఇక్కడే రాజధాని అని చెప్పారని, తర్వాత మూడు ముక్కలాట జగన్ ప్రారంభించారన్నారు.

ఒకవర్గానిదంటూ....
పశువులతో కూడా వీళ్లని పోల్చలేమని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఒకే వర్గానిదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన చెందారు. ముంపు లేకపోయినా ముంపు ప్రాంతమని నమ్మబలికే ప్రయత్నం చేశారన్నారు. ప్రజారాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చారన్నారు. ఇలాంటి దుర్మార్గులు ఉంటారనే తాము సీఆర్డీఏ చట్టాన్ని తెచ్చామని చంద్రబాబు తెలిపారు. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, జగన్ చరిత్రహీనుడిగా మిగిలిపోతారని చంద్రబాబు అన్నారు.


Tags:    

Similar News