తాడిపత్రిలోకి ఎంటర్ అయిన లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర నేడు తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. నేటికి లోకేష్ పాదయాత్ర 67వ రోజుకు చేరుకుంది. ఉదయం 7 గంటలకు ఉల్లికంటిపల్లి నుంచి బయలుదేరని లోకేష్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు భారీ ఎత్తున లోకేష్ కు స్వాగతం పలికారు. అనంతరం సింగనగుట్టపల్లిలో స్థానికులతో సమావేశం కానున్నారు. 7.35 గంటలకు తబ్బుల వద్ద స్థానికులతో సమావేశమవుతారు. అనంతరం 8.25 గంటలకు తబ్బుల 2 వద్ద ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు.
టెన్షన్ గానే...
ఉదయం 10.10 గంటలకు మత్స్యకారులతో లోకేష్ సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తారు. 11 గంటలకు పెద్దపప్పూరు శివారుల్లో దేదేకుల సామాజికవర్గంతో భేటీ అవుతారు. ఆ గ్రామ శివారులో భోజన విరామానికి ఆగుతారు. అనంతరం మూడు గంటలకు అక్కడే బుడగజంగాలతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. 4.35 గంటలకు పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్ వద్ద రజకులతో సమావేశమవుతారు. 6.15 గంటలకు గార్లదిన్నెలో స్థానికులతో సమావేశమవుతారు. అనంతరం రాత్రికి పసలూరులో బస చేస్తారు. కాగా తాడిపత్రిలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో రెండు వర్గాలు ఇప్పటికే పరస్పరం సవాళ్లు విసరడంతో పాదయాత్ర టెన్షన్ గా మారింది.