Breaking : ఉత్తరాంధ్రలో టీడీపీకి షాక్
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుంది. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి;
ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగలనుంది. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలతో ఆయన చర్చించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు.
వచ్చే నెలలో...
గంటా శ్రీనివాసరావుకు పార్టీలు, నియోజకవర్గాలు మారడం కొత్త కాదు. ఆయన జనసేనలో చేరతారని అందరూ భావించారు. కానీ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. ఈ మేరకు సన్నిహితులతో కూడా ఆయన సంప్రదింపులు జరిపారు. డిసెంబరు 1వ తేదీన ఆయన పుట్టిన రోజు. పుట్టిన రోజు తర్వాత ఆయన వైసీపీలో చేరే అవకాశాలున్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.