శ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం.. దుకాణాలు ధ్వంసం

శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కన్నడ భక్తులు కొందరు దుకాణాలకు నిప్పుపెట్టడంతో ఘర్షణ తలెత్తింది;

Update: 2022-03-31 01:33 GMT

శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కన్నడ భక్తులు కొందరు దుకాణాలకు నిప్పుపెట్టడంతో ఘర్షణ తలెత్తింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి కన్నడ భక్తులు ఎక్కువ మంది వచ్చారు. అయితే ఒక టీ దుకాణం వద్ద కన్నడ భక్తులకు, దుకాణం వారికి మధ్య వాగ్వాదం తలెత్తి అది చివరకు ఘర్షణకు దారితీసింది.

వాహనాలకు.....
రెచ్చిపోయిన కన్నడ భక్తులు పుణ్యక్షేత్రంలోని దుకాణాలకు నిప్పు పెట్టారు. దీంతో స్థానికులు కన్నడ భక్తులపై దాడికి దిగారు. ఈ దాడిలో కన్నడ భక్తుడికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ దాడుల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News