టీటీడీకి బాంబు బెదిరింపు కాల్‌.. ఆక‌తాయి అరెస్ట్‌

టీటీడీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు.;

Update: 2023-08-19 14:39 GMT
టీటీడీకి బాంబు బెదిరింపు కాల్‌.. ఆక‌తాయి అరెస్ట్‌
  • whatsapp icon

టీటీడీకి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు. అలిపిరి చెక్‌పోస్టు వ‌ద్ద‌ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందని.. 100 మందికి పైగా భక్తులు చనిపోతారని అపరిచితుడు ఫోన్ కాల్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ నెల 15వ తేదీన ఉదయం 11.25 గంటలకు టీటీడీ కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ రాగా.. వెంట‌నే అప్రమ‌త్త‌మై చెక్‌పోస్ట్ వద్ద‌ పూర్తిస్థాయిలో తనిఖీలు చేప‌ట్టారు. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదు

టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫోన్ కాల్‌పై ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు విచార‌ణ చేప‌ట్టి న‌కిలీ ఫోన్‌కాల్‌గా నిర్ధారించారు. కాల్ చేసి అలజడి సృష్టించిన వ్యక్తిని సేలంకు చెందిన బాలాజీగా గుర్తించారు. వెంట‌నే బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల డిఎస్పీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. టీటీడీకి ఇబ్బంది కలిగించే వారిపైన, ఆకతాయి చేష్టలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.




Tags:    

Similar News