గాజువాకలో ఘర్షణ... వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య?

విశాఖ గాజువాకలో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది;

Update: 2022-03-28 04:57 GMT
ysrcp and tdp, gajuwaka, visakhapatnam, bandh
  • whatsapp icon

విశాఖ గాజువాకలో తెలుగుదేశం, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈరోజు కార్మికసంఘాలు విశాఖ బంద్ కు పిలుపునిచ్చాయి. విశాఖ బంద్ కు టీడీపీ, వైసీపీలు కూడా మద్దతిచ్చాయి. అయితే గాజువాక సెంటర్లో వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు బంద్ కార్యక్రమానికి ముందున్నారు. అయితే వీరి సమక్షంలోనే రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది.

జగన్ డౌన్ డౌన్ అనడంతో....
టీడీపీ కార్యకర్తలు డౌన్ డౌన్ జగన్ అంటూ నినాదాుల చేయడంతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. టీడీపీ కార్యకర్తలు కూడా ప్రతిదాడికి దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో బంద్ ను నిర్వహించుకోవాలని పోలీసులు ఇరువర్గాలకు సూచించారు.


Tags:    

Similar News