ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం.. 9 బస్సులు దగ్దం

ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు తొమ్మిది ప్రయివేటు బస్సులు దగ్దమయ్యాయి.;

Update: 2022-03-01 06:03 GMT

ఒంగోలు : ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు తొమ్మిది ప్రయివేటు బస్సులు దగ్దమయ్యాయి. ప్రయివేటు బస్సులు పార్కింగ్ చేసే స్థలంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలులోని ఉడ్ కాంప్లెక్స్ ఏరియా పార్కింగ్ లో జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది బస్సులు పూర్తిగా దగ్దమయ్యాయి.

పార్కింగ్ లో....
పార్కింగ్ లో మొత్తం 20 బస్సులు నిలిపి ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అగ్ని మాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చాయి. మొత్తం ఆరు అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పాయి. ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. దగ్దమయిన బస్సులన్నీ ప్రయివేటు ట్రావెల్స్ కు చెందినవే.


Tags:    

Similar News