Tiger : శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం
శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి రాత్రి వేళ బయటకు రావడానికి భయపడుతున్నారు. పశువులను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పులి సంచారం ఉందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూసి పులి అడుగుజాడలను చూసి దానిని పులిగా నిర్ధారించారు.
ఒడిశా నుంచి వచ్చి...
శ్రీకాకుళం జిల్లా మందస మండలం చీపిలో పెద్దపులి సంచరిస్తుంది. ఒడిశా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాలో ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు అభిప్రయాపడుతున్నారు. పులి బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. అయితే ప్రజలు తమ జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.