పిల్లలతో పులి సంచారం.. బెదిరిపోతున్న గ్రామస్తులు
కడపజిల్లా లింగాల మండలంలో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తుంది
కడపజిల్లా లింగాల మండలంలో పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తుంది. పిల్లలతో పులి తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీ శాఖ అధికారులు వచత్చి పులి జాడలను గమనించి ఇది పిల్లలతో కలసి తిరుగుతుందని నిర్ధారించారు. పిల్లలతో తిరుగుతున్న పులితో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
బయటకు వెళ్లవద్దంటూ...
తాతిరెడ్డి పాలెంలో పులి తన పిల్లలతో కలసి తిరుగుతుండగా గొర్రెల కాపరులు దీనికి సంబంధించి వీడియో తీశారు.ప్రజలు బయటకు వచ్చేటప్పుడు, పొలాల్లో ఒంటరిగా పనిచేయడానికి వెళ్లవద్దని సూచించారు. పది మంది కలసి వెళ్లాలని తెలిపారు. పిల్లలతో తిరుగుతున్న పులి ప్రమాదకరమని, అది మనుషుల మీద దాడి చేసే అవకాశముందని చెబుతున్నారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండటమే కాకుండా, పెంపుడు జంతువులను కూడా బయటకు విడిచిపెట్టవద్దని సూచించారు.