Tirumala : వడ్డీ కాసుల వాడి చెంతకు పోటెత్తిన భక్తజనం

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.

Update: 2024-06-29 03:13 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. శనివారం వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే శుభమని భావించి ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తుండటంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులతో కిటికిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనానికి కూడా గంటల సమయం పడుతుంది. అలాగే వసతి గృహాలు కూడా దొరకడం దుర్లభంగా మారిది. తిరుమలలో గత కొద్ది రోజుల నుంచి భక్తుల సంఖ్య అధికంగా ఉంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రేపు కూడా భక్తుల సంఖ్య అధికంగానే ఉంటుందన్న అంచనా వేస్తున్నారు.

హుండీ ఆదాయం...
ఈరోజు శనివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారని అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనిన 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 66,256 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,087 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.54 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. భక్తులు ఇబ్బంది పడకుండా టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.


Tags:    

Similar News