తిరుమలకు వెళ్లే భక్తులను భయపెట్టే మరో విషయం
తిరుమలలో వన్యప్రాణులు భక్తులను భయపెడుతూ ఉన్నాయి. గత కొన్ని నెలల్లో
తిరుమలలో వన్యప్రాణులు భక్తులను భయపెడుతూ ఉన్నాయి. గత కొన్ని నెలల్లో ఓ బాలుడు చిరుత దాడిలో గాయపడి ప్రాణాలతో బయటపడగా.. మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి ఆపరేషన్ చిరుత కొనసాగిస్తోంది. ఈ ఆపరేషన్‌లో ఇప్పటికే ఐదు చిరుతలను బంధించారు. అయితే ఆపరేషన్ చిరుతలో భాగంగా తిరుమల నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు తాజాగా మరో రెండు చిరుతల కదలికలు చిక్కాయి.
ట్రాప్ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన అటవీశాఖ అధికారులు ఇంకా రెండు చిరుతల సంచారాన్ని గుర్తించారు. స్పెషల్ టైప్ క్వార్టర్స్ సమీపంలో ఒక చిరుత, నరసింహస్వామి ఆలయ సమీపంలో మరో చిరుత సంచరిస్తున్నట్టు గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. రెండు చిరుతలను బంధించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెండు చిరుతలను కూడా బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఐదు చిరుతలను ఫారెస్ట్ అధికారులు బంధించారు. జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28, సెప్టెంబర్ 6వ తేదీల్లో మొత్తం ఐదు చిరుతలను బంధించారు ఫారెస్ట్ అధికారులు.