నిండిపోయిన క్యూ కాంప్లెక్స్ .. దర్శనానికి ?

విద్యాసంస్థలు తెరచుకోవడంతో పాటు.. ఆషాఢమాసం కూడా కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.

Update: 2023-06-30 03:58 GMT

tirumala rush today

వీకెండ్ వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మొన్నటి వరకూ వేసవి సెలవులు కావడంతో క్యూ కాంప్లెక్స్ లు భక్తులతో నిండిపోయి.. వెలుపలికి కూడా క్యూ లైన్లు వచ్చాయి. విద్యాసంస్థలు తెరచుకోవడంతో పాటు.. ఆషాఢమాసం కూడా కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. మళ్లీ ఇప్పుడు వారాంతం రావడంతో రద్దీ పెరిగింది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టు మెంట్లన్నీ నిండి.. క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.

గురువారం స్వామివారిని 62,005 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,127 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది. భక్తులకు అన్నపానీయాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.


Tags:    

Similar News