తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ.. ఎలా ఉందంటే.. సర్వదర్శనానికి గంటల సమయం పడుతోంది

Update: 2023-08-14 03:04 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం నాడు కూడా కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 84,401 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 37738 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమల శ్రీవారిని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ దర్శించుకున్నాడు. ఆగస్టు 13వ తేదీ ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో రోహిత్ శర్మ భార్య, కూతురితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నాడు. రోహిత్‌ శర్మ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వాదం అందించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు రోహిత్‌ శర్మను సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారిని రోహిత్ శర్మ 2019 వరల్డ్ కప్ ముందు కూడా దర్శించుకున్నాడు. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఆ ప్రపంచకప్ లో 5 శతకాలు బాది.. ఓ ప్రపంచకప్ లో అత్యధిక సెంచరీలు కొట్టిన ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం వన్డే ప్రపంచకప్ లలో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్ గా సచిన్ టెండూల్కర్ తో కలిసి సమానంగా ఉన్నాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ రోహిత్ శర్మ తిరుమలకు వచ్చాడు.


Tags:    

Similar News