Tirumala : తిరుమలకు నీటి కష్టాలు మరో ఏడాది లేనట్లే.. ఫుల్లయిన రిజర్వాయర్లు

తిరుమలకు నీటి కష్టాలు తీరిపోయాయి. మరో ఏడాది వరకూ తాగునీటికి తిరుమలకు ఏ మాత్రం ఇబ్బంది లేదు

Update: 2024-12-03 11:49 GMT

తిరుమలకు నీటి కష్టాలు తీరిపోయాయి. మరో ఏడాది వరకూ తాగునీటికి తిరుమలకు ఏ మాత్రం ఇబ్బంది లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమలలోని జలాశాయాలన్నీ నిండిపోయాయి. పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమార ధార, పసుపు ధార జలాశయా్లలో నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమలకు ఏడాది పాటు నీటి ఎద్దడి తప్పిపోయిందని అధికారులు తెలిపారు. ప్ర‌స్తుత నీటి నిల్వ‌లు తిరుమ‌ల‌కు 270 రోజుల తాగునీటి అవ‌స‌రాల‌కు స‌రిపోతాయని అధికారులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి జలాశయాల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.


1) పాపవినాశనం డ్యామ్ :- 697.00 మీ. FRL :- 697.14 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 5240.00 ల‌క్ష‌ల గ్యాలన్లు - ప్ర‌స్తుత నిల్వ :- 5192.54 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
2) గోగర్భం డ్యామ్ :- 2894.00 అడుగులు FRL :- 2894.00 అడుగులు
నిల్వ సామ‌ర్థ్యం :- 2833.00 ల‌క్ష‌ల గ్యాలన్లు - ప్ర‌స్తుత నిల్వ :- 2833.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
3) ఆకాశగంగ డ్యామ్ :- 864.50 మీ FRL :- 865.00 మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 685.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు - ప్ర‌స్తుత నిల్వ :- 645.00 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు.
4) కుమారధార డ్యామ్ :- 895.50.00 మీ. FRL :- 898.24మీ
నిల్వ సామ‌ర్థ్యం :- 4258.98 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు- ప్ర‌స్తుత నిల్వ :- 3440.32 ల‌క్ష‌ల‌ గ్యాలన్లు -
5) పసుపుధార డ్యామ్ :- 896.50 మీ. FRL :- 898.24మీ.
నిల్వ సామ‌ర్థ్యం :- 1287.51 ల‌క్ష‌ల గ్యాలన్లు - ప్ర‌స్తుత నిల్వ :- 966.31 ల‌క్ష‌ల గ్యాలన్లు.


Tags:    

Similar News