Tirumala : శనివారం.. నమో వెంకటేశా.. దర్శనం అంత కష్టమా?

నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు.

Update: 2024-06-22 03:23 GMT

నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. సాధారణంగా శుక్ర, శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వరస సెలవులు ఉండటంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వస్తారు. అందుకే శని, ఆదివారాలు భక్తులతో తిరుమల వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఈరోజు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

నేడు కూడా ...
ఈరోజు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీసీ వరకూ క్యూ లైన్ నిండి ఉంది. క్యూ లైన్ లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు అన్నప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది. నిన్న తిరుమల శ్రీవారిని 72,294 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 31,855 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News