Heavy Rains : భారీ వర్షాలు.. బెంగళూరు - హైదరాబాద్ హైవేపై నిలిచిన రాకపోకలు

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి

Update: 2024-10-22 04:24 GMT

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రత్యేక బృందాలు ప్రయత్నించాయి. కానీ అప్పటికే అన్నమయ్య జిల్లాలోని అనేక గ్రామాల్లో ఇళ్లు నీట మునిగిపోవడంతో సామగ్రి మొత్తం వరద నీటిలో తడిసి పోయిందని తెలిపారు.

జాతీయ రహదారిపై...
పండమేరు వాగుకు ఆనుకున్న ఉన్న అనంతపురం జిల్లాలో పలు కాలనీల్లోకి వరద నీరు ప్రవేశించడంతో స్థానికులందరూ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో బస్సులు, కార్లు నిలిచిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్థంభించింది. జేసీబీల సాయంతో పోలీసులు జాతీయ రహదారిపై వరద నీటిలో చిక్కుకున్న వాహనాలను బయటకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Tags:    

Similar News