టీటీడీ ఆన్ లైన్ పోర్టల్ లో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల విడుదల
జులై, ఆగస్ట్ నెలలకు సంబంధించి రూ. 300 విలువైన ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది.
జులై, ఆగస్ట్ నెలలకు సంబంధించి రూ. 300 విలువైన ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. టీటీడీ ఆన్ లైన్ పోర్టల్ నుంచి టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రోజుకు 25 వేల టికెట్ల చొప్పున టీటీడీ ఆన్ లైన్లో ఉంచింది. tirupatibalaji.ap.gov.in లింక్ ద్వారా టీటీడీ వెబ్ సైట్లో లాగిన్ అయి టికెట్లను బుక్ చేసుకోవచ్చు. జులై, ఆగస్టు మాసాలకు సంబంధించిన దర్శనం టికెట్లను ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేసింది. భక్తులు తమకు వీలైన సమయం చూసుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. ఇక ఆన్ లైన్ లో రూ.300 ల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జూలై,ఆగస్ట్ నెలలకు సంబంధించి మొత్తం 13.35 లక్షల టిక్కెట్లు విడుదల చేసింది టీటీడీ. ఇక ప్రస్తుతం సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శుక్రవారం నాడు శ్రీవారిని 71,119 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,256 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో జులై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ప్రటించింది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కేవలం ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసినట్టు తెలిపింది.