రీల్స్ కోసం నదిలో సాహసం.. ఇద్దరి యువకుల గల్లంతు
అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ కోసం నదిలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.;

అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ కోసం నదిలో దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు రీల్స్ కోసం పడవలో దిగగా, అది బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఒకరు మాత్రం బయట పడ్డారు. ముగ్గురు యువకులు ఒడిశా నుంచి ఇక్కడకు వచ్చినట్లు తెలిసింది. ముంచింగుిపట్టుు జోలాపుట్ జలాశయంలో ఈ ఘటన జరిగింది. గల్లంతయిన వారు అమిత్, శివ గా గుర్తించారు.
కోరాపుట్ జిల్లాకు చెందిన..
కోరాపుట్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. గల్లంతయి వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రీల్స్ పిచ్చితో నదిలో పడవలో వెళుతూ సెల్ఫీకి ప్రయత్నిస్తుండగా పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతయిన వారి కోసం వెతుకుతున్నారు.