ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు
రాజధాని అమరావతిలో సచివాలయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించింది.
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట లభించింది. రాజధాని అమరావతిలో సచివాలయం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించింది. మూడు రాజధానుల బిల్లులను ప్రభుత్వం వెనక్కు తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులను కేటాయించింది. ఏపీ రాజధానిలో సచివాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 1,224 కోట్ల రూపాయలను కేటాయించింది.
క్వార్టర్స్ నిర్మాణం కోసం....
దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణం కోసం1,123 కోట్లు, జీపీవోఏకు భూసేకరణ కోసం 6.69 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే ఈ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల కానున్నాయి. 2022 - 2023 బడ్జెట్ లో రాజధాని నిర్మాణం కోసం ఈ నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మూడు రాజధానుల బిల్లులను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం త్వరలోనే కొత్త బిల్లులను న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను జగన్ ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.