పార్లమెంట్ ఆవరణలోఅరకు కాఫీ స్టాల్

ఈరోజు పార్లమెంట్ ఆవరణలోఅరకు కాఫీ స్టాల్ ను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు;

Update: 2025-03-24 05:50 GMT
kiren rijijuk, union minister, araku coffee stall, parliament premises
  • whatsapp icon

ఈరోజు పార్లమెంట్ ఆవరణలోఅరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ స్టాల్ ను పార్లమెంటు క్యాంటిన్ లో ఈ అరకు కాఫీ స్టాల్ ను ప్రారంభించారు. అరకు కాఫీ కోసం ప్రాచుర్యం కల్పించేందుకు స్పీకర్ అనుమతితో అరకు కాఫీ స్టాల్ ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఈ అరకు కాఫీని తాగి కాసేపు ఉల్లాసంగా గడిపారు.

ఈ నెల 28వ తేదీ వరకూ...
అరకు కాఫీ స్టాల్ ను ఈరోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ స్టాల్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖా మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి ని ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చారు. అందరి సమక్షంలో కిరణ్ రిజిజు ఈ స్టాల్ ను ప్రారంభించారు. నాణ్యత, మంచి వాసనలతో ఉన్న ఈ కాఫీని అందరూ రుచిచూడాలని కిరణ్ రిజిజు కోరారు.


Tags:    

Similar News