Vijayawada : విజయవాడతో అన్ని సంబంధాలు కట్...రోడ్డు మార్గం తెరిచినా?

విజయవాడ ప్రస్తుతం డేంజర్ పొజిషన్ లో ఉంది. ఎక్కడ చూసినా వరద నీరే. దాదాపు మూడు వంతులకుపైగా విజయవాడలో వరద నీరు చేరింది.

Update: 2024-09-03 04:46 GMT

విజయవాడ ప్రస్తుతం డేంజర్ పొజిషన్ లో ఉంది. ఎక్కడ చూసినా వరద నీరే. దాదాపు మూడు వంతులకుపైగా విజయవాడలో వరద నీరు చేరింది. ప్రకాశం బ్యారేజీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఇంకా పదకొండు లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో దాదాపు ఎక్కువ ప్రాంతాలు ఇంకా నీళ్లలోనే నానుతున్నాయి. హోం మంత్రి వంగలపూడి అనిత నివాసంతో సహా ప్రధానమైన ప్రాంతాలన్నీ నీళ్లలోనే ఉన్నాయి.

అన్ని మార్గాల నుంచి...
దీంతో విజయవాడ వైపు వెళ్లే రైలు మార్గం బంద్ అయింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఇక జాతీయ రహదారిపైకి వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపేశారు. ఇటు గుంటూరు వైపు జాతీయ రహదారి పైకికూడా నీరు చేరింది. అయితే రాత్రి కొంత వాహనాలకు అనుమతిచ్చారు. ఖాజా టోల్ గేట్ వద్ద వరద నీరు ప్రవహిస్తుంది. మరో వైపు ఏలూరు నుంచి వచ్చే జాతీయ రహదారిపై కూడా వరద నీరు పారుతుంది. దీంతో అటు వైపు కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో బెజవాడను కలిపే అన్ని రూట్లలో వాహనాల రాకపోకలు నిలిచి పోవడంతో రవాణా వ్యవస్థ మూడు రోజు పాటు స్థంభించింది. రాకపోకలు రాత్రి నుంచి ప్రారంభమయినా ప్రయివేటు బస్సులు, ఆర్టీసీ బస్సులు మాత్రం ఇంకా తిరగడం లేదు. లారీలు మాత్రం తిరుగుతున్నాయి. రైళ్ల పునురుద్ధరణ జరిగలేదు.
విమాన ప్రయాణాలు మాత్రం...
రైలు, రోడ్డు రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో ఎక్కువ మంది ఇక ఇక విమానాల ద్వారానే ప్రయాణం చేస్తున్నారు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్టు కిటికిటలాడుతుంది. ఎక్కువ మంది విజయవాడ వాసులు హైదరాబాద్ లో ఉండటంతో తమ వాళ్ల కోసం వచ్చేందుకు కూడా విమానాలను ఆశ్రయిస్తున్నారు. విజయవాడ నుంచి వెళ్లే వారు కూడా విమానాలనే ఆశ్రయిస్తున్నారు. అయితే విమాన ప్రయాణం కొందరికే సాధ్యమవుతుండటంతో సామాన్యుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో అధిక మొత్తంలో ప్రయాణ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అప్పటికప్పుడు టిక్కెట్ బుక్ చేసుకునేవారికి ప్రయాణం తడిసి మోపెడంత అవుతుంది.
అన్ని ప్రాంతాల్లో...
గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవు. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు మాత్రమే వరద ముంపునకు గురయ్యేవి. ఇప్పుడు అది ఇది కాదు అన్ని ప్రాంతాలు నీటిలో కూరుకుపోయాయి. చివరకు పెనమలూరు ప్రాంతంలోనూ వరద నీరు చేరుతుంది. భవానీపురం, రాజరాజేశ్వరి నగర్ ప్రాంతాల్లోకి కూడా వరద నీరు చేరింది. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోనూ వరద నీరు చేరింది. ఇక విజయవాడ పాతబస్తీలో నీరు వచ్చే అవకాశం లేదు. కానీ ఈసారి మాత్రం పాతబస్తీ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.


Tags:    

Similar News