Vijayawada : బ్రహ్మంగారు చెప్పింది నిజమవుతుందా? విజయవాడలో ఇదే హాట్ టాపిక్

గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం నమోదు కావడంతో పాటు నదులు, వాగులు ఏకమై విజయవాడ నగారాన్ని ముంచెత్తాయి

Update: 2024-09-01 12:47 GMT

పోతులూరి వీరబ్రహ్మం స్వామి చెప్పినట్లు నిజమయ్యేటట్లే కనిపిస్తుంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ముక్కుపుడకను వరద నీరు తాకుతుందన్న ఆయన కాలజ్ఞానం నిజమయ్యేటట్లే కనిపిస్తుంది. అదే ఇప్పుడు విజయవాడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షపాతం నమోదవ్వడమే కాకుండా, నదులు, ప్రాజెక్టులు నిండిపోయి బెజవాడపై పడ్డాయి. ఇటు బుడమేరు వాగు వెనక్కు ప్రవహిస్తుండటంతో కాలనీలో ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. గతలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో వరద నీరు ఉప్పొంగింది. గత ఇరవై ఏళ్లలో ఎప్పడూ జరగని నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

నగరాన్ని ముంచెత్తి...
ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షం నమోదు కావడంతో పాటు నదులు, వాగులు ఏకమై విజయవాడ నగారాన్ని ముంచెత్తాయి. గతంలోనూ వరదలు వచ్చాయి. అయితే కృష్ణానది కరకట్ట మీద ఉన్న రామలింగేశ్వరనగర్ వంటి ప్రాంతాలు మాత్రమే నీట మునిగేవి. బుడమేరు ఇరవై ఏళ్ల క్రితం పొంగిందని, అప్పుడు కొంత ఇబ్బందయిందని నగర వాసులు చెబుతున్నారు. అయితే ఇంత భారీ స్థాయిలో మాత్రం వరద నీరు విజయవాడలో చేరడం దాదాపు అన్ని ప్రాంతాలలోకి వరద నీరు చేరి ప్రజలు ఇళ్లలో నుంచి రావడానికే భయపడిపోతున్నారు. ఎక్కడ చూసినా బెజవాడ మొత్తం వరద నీరు కనిపిస్తుంది. ప్రజలు నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు.
రేపు కూడా భారీ వర్షం...
వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అయితే అనేక మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో అన్ని ఏర్పాట్లు చేశారు. కొందరిని మాత్రం ఇళ్లలో నుంచి బయటకు తేలేకపోతున్నారు. ఈరోజు కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికతో ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. జాతీయ రహదారుల పైకి నీరు చేరి పూర్తిగా రాకపోకలు స్థంభించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు లేవు. రైళ్లు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నారు. రైల్వేస్టేషన్, బస్టాండ్ లలోనే తలదాచుకుంటున్నారు.
37 సెంటీమీటర్ల వర్షపాతం...
విజయవాడలో గత రెండు రోజుల నుంచి దుకాణాలు కూడా తెరుచుకోవడం లేదు. ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తుండటంతో పరిస్థితి భయానకంగా ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు సమీక్షిస్తున్నారు. అయితే గతంలో బుడమేరు వెనక్కు తనలేదని, ఇప్పుడు దాని వల్ల సింగ్ నగర్ తో పాటు అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తి దిగువకు కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. అసాధారణ వర్షపాతం నమోదయింది. ఎన్నడూ లేని విధంగా 37 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మొత్తం మీద బెజవాడ నీటిలో నానుతుంది. కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News