Ys Jagan : నేడు జగన్ ఎన్నికల ప్రచారానికి బ్రేక్

నేడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ బ్రేక్ ఇచ్చారు;

Update: 2024-05-08 03:47 GMT

నేడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ బ్రేక్ ఇచ్చారు. ఆయన తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఉండనున్నారు. ఆంధ్రప్రపదేశ్ లో ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. పదకొండో తేదీ సాయంత్రానికి ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది.

ఇప్పటికే పలుమార్లు...
అయితే ఇప్పటికే అనేక సార్లు ప్రచారానికి బ్రేక్ ఇచ్చిన జగన్ పార్టీ విజయం కోసం అనేక రకాలైన వ్యూహాలను రచిస్తున్నారు. సీనియర్ నేతలతో సమావేశం కావడంతో పాటు జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో కొంత సమయాన్ని వెచ్చిస్తున్నారు. రేపు అనంతపురం జిల్లాలో జగన్ పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News