Ys Jagan : నేడు రెండోరోజు పులివెందులలో జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు రెండో రోజు పులివెందులలో పర్యటిస్తున్నారు. నేడు వైసీపీ నేతలతో సమావేశం అవుతున్నారు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు రెండో రోజు పులివెందులలో పర్యటిస్తున్నారు. నేడు వైసీపీ నేతలతో సమావేశం అవుతున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పులివెందులకు చేరుకుంటున్నారు. ఓటమి తర్వాత తొలిసారి పులివెందుల వచ్చిన జగన్ కు నిన్న పెద్దయెత్తున కార్యకర్తలు స్వాగతం పలికారు. ఒకదశలో కార్యకర్తలను కట్టడి చేయడం కూడా కష్టంగా మారింది. నిన్న పులివెందులలోని జగన్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులతో పాటు పార్టీ నేతలు చెబుతున్నారు.
అదంతా ఉత్తిదే...
అయితే పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారని, .కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని, పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు. పులివెందులలో ఎటువంటి రాళ్లదాడి జరగలేదని, పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని, కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడనీకి ప్రజలు ఆత్రుతతో ఒకరిపై ఒకరు తోసకోవడంతోనే ఇంటి అద్దాలు పగిలాయని పులివెందుల డిఎస్పి వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు.