Ys Jagan : రేపు బెంగళూరుకు వైఎస్ జగన్
లండన్ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ బయలుదేరారు. రేపు బెంగళూరుకు చేరుకోనున్నారు;

లండన్ నుంచి వైసీపీ అధినేత వైఎస్ జగన్ బయలుదేరారు. తన కుమార్తె చదువు పూర్తయిన సందర్భంగా ఆయన లండన్ పర్యటనకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. అయితే లండన్ వెళ్లిన జగన్ కుటుంబ సభ్యలుతో కలసి కొన్ని రోజుల పాటు అక్కడే ఉన్నారు. సీబీఐ కోర్టు అనుమతితో ఆయన బయలుదేరి వెళ్లారు.
వచ్చే నెల 3న తాడేపల్లికి
రేపు ఉదయం 9 గంటలకు బెంగళూరుకు వైఎస్ జగన్ చేరుకోనున్నారు. వచ్చే నెల 3న తాడేపల్లిలోని తన నివాసానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఈ నెల మూడో వారం నుంచి జిల్లాల పర్యటన చేస్తానని ప్రకటించిన జగన్ లండన్ బయలుదేరి వెళ్లడంతో ఆయన పర్యటన వాయిదా పడింది.