YSRCP : నేడు వైసీపీ కీలక సమావేశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

Update: 2024-12-04 02:00 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షులు, రాజనల్ కో-ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావడంతో సూపర్ సిక్స్ హామీల అమలు చేయకుండా ఉండటం, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై చర్చించి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆందోళన కార్యక్రమాలను రూపొందించనున్నారు.

వివిధ సమస్యలపై...
ధాన్యం సేకరణలోనూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే విధంగా, విద్యుత్తు ఛార్జీల పెంపుదల వంటి అంశాలపై చర్చించి ఆందోళన కార్యక్రమాలను ఈ సమావేశంలో రూపొందించనున్నారు. దీంతోపాటు వైసీపీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై కూడా చర్చించనున్నారు. ఇందుకోసం సమావేశంలో పలు కమిటీలను నిర్ణయించే అవకాశముంది. జనవరి రెండో వారం తర్వాత జగన్ జిల్లాల పర్యటనపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రం, జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముంది.


Tags:    

Similar News