Ys Jagan : నేడు విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు, రేపు విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు;

Update: 2024-08-13 02:15 GMT
ys jagan, ycp chief, three days tour, kadapa district
  • whatsapp icon

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు, రేపు విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించింది ఇప్పటికే బొత్స సత్యనారాయణ నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆయన ఈరోజు, రేపు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలకు చెందిన ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో సమావేశమయ్యారు.

క్యాంప్ లో కొందరు...
కొందరు జడ్పీటీసీ, ఎంపీటీసీలను బెంగళూరు క్యాంప్ నకు తరలించారు. ఇక ఈరోజు, రేపు మిగిలిన నియోజకవర్గాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. దీంతో ఈరోజు, రేపు జగన్ ఇతర సందర్శకులు కలిసే అవకాశముండదని పార్టీ కార్యాలయం తెలిపింది. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గత కొన్నాళ్ల నుంచి జగన్ ప్రజా ప్రతినిధులతో సమావేశమై వారితో నేరుగా మాట్లాడుతూ ఫొటోలు దిగుతున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News