Ys Jagan : నేడు మూడు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటన

వైసీపీ అధినేత జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు;

Update: 2024-05-07 02:16 GMT
Ys Jagan : నేడు మూడు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటన
  • whatsapp icon

వైసీపీ అధినేత జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు ఎన్నికల ప్రచారానికి గడువు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తాను చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ విపక్షాలకు ఓటేస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని చెబుతూ ముందుకు సాగుతున్నారు. పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

ఈరోజు ఇలా...
ఈరోజు ఉదయం పది గంటలకు రాజమండ్రి లోక్ సభ పరిధిలోని రాజానగరంలో జరిగే సభలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు శ్రీకాకుళం లోక్ సభ స్థానం పరిధిలోని ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్ లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం లోక్ సభ పరిధిలోని గాజువాక నియోజకవర్గంలో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు తగిన ఏర్పాట్లను పార్టీ నేతలు పూర్తి చేశారు.


Tags:    

Similar News