Good News: సీఎం జగన్ న్యూ ఇయర్ గిఫ్ట్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పెన్షనర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.3 వేలకు పెంచారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్‌ను రూ. 3 వేల వరకు పెంచుకుంటూ పోతామని చెప్పిన సీఎం జగన్.. ఆ ఎన్నికల హామీని పూర్తి చేశారు. నేటి నుంచి జనవరి 8 వ తేదీ వరకు 8 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పెంపు ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలన్నారు. కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో ఈనెల 3 వ తేదీన జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
పెన్షన్లను క్రమంగా రూ.3వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చారు సీఎం జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇకపై ప్రతినెలా రూ. 3వేల పెన్షన్ ఇవ్వనున్నారు. 2014-19లో గత పాలనలో పెన్షన్ రూ.1000 ఉండగా.. జులై 2019 నుంచి పెన్షన్‌ను రూ.2,250లకు పెంపు. జనవరి 2022న రూ.2,500కు పెన్షన్ పెంచారు. జనవరి 2023న రూ. 2,750కు పెంపు. జనవరి 2024న రూ.3వేలకు పెంచింది ప్రస్తుత ప్రభుత్వం. పెన్షన్ లబ్ధిదారులు కూడా గత ప్రభుత్వ పాలనలో 39 లక్షలు ఉంటే, ఇప్పుడు 66.34లక్షలకు చేరుకున్నారు.