YS Jagan: అప్పులపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం

Update: 2024-07-26 10:38 GMT

 ys jagan

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు అంటేనే వంచన, తప్పుడు ప్రచారం.. అందుకే ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటున్నారని విమర్శించారు. సాధారణ బడ్జెట్ అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన మోసపూరిత హామీలన్నింటిని చూపించాల్సి వస్తుందని, అందుకే 7 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారని జగన్ ఆరోపించారు.

రాష్ట్రం నిజంగానే ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందా అనే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు వైఎస్ జగన్. మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించి, వాస్తవాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం అయిపోయిందనే వాదనను చంద్రబాబు మీడియా సమావేశాల్లోనూ, గవర్నర్ ప్రసంగంలోనూ తీసుకొచ్చాడు. చంద్రబాబు అనే వ్యక్తి గవర్నర్ తో కూడా అబద్ధాలు చెప్పించాడు, శ్వేతపత్రం పేరుతో మరీ అబద్ధాలు ఆడుతున్నాడన్నారు. జూన్ నెల వరకు తీసుకుంటే ఏపీ ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు రూ.5.18 లక్షల కోట్లు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాకముందు రూ.1,18,051 కోట్ల అప్పు ఉంటే 2019లో చంద్రబాబు దిగిపోయే సమయానికి రూ.2,71,798 కోట్ల అప్పు ఉందన్నారు. జూన్ లో మా పాలన ముగిసే సమయానికి ప్రభుత్వ అప్పు రూ.5.18 లక్షల కోట్లుగా ఉంది. వాటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ రుణాలు రూ.1.06 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ లేని రుణాలు రూ.1.23 లక్షల కోట్లు ఉన్నాయి. మొత్తమ్మీద పూర్తిస్థాయిలో రాష్ట్ర అప్పులు చూస్తే రూ.7.48 లక్షల కోట్లని జగన్ వివరించారు. చంద్రబాబు గోబెల్స్ సిద్ధాంతాన్నే నమ్ముకున్నారని, చంద్రబాబు చెప్పిందే ఎల్లోమీడియాకు వేదం అని, చంద్రబాబు ఏం చెబితే అదే ఎల్లో మీడియా రాస్తుందన్నారు.


Tags:    

Similar News