YS Sharmila: దీపం పథకంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

దీపం పథకంపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు, ఉచిత సిలిండర్లు ఇస్తూ ప్రజలపై కరెంటు చార్జీల భారం పెడుతున్నారన్నారు.

Update: 2024-11-02 11:32 GMT

ys sharmila

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శలు గుప్పించారు. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని చెబుతున్న కూటమి ప్రభుత్వం విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని ఆరోపించారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే ఇదేనని అన్నారు. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు ఖర్చు అవుతుంటే, ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో అదనంగా వసూలు చేసేది రూ.6 వేల కోట్లు అని ఆరోపించారు షర్మిల. దీపం - 2 కింద వెలుగులు పక్కన పెడితే.. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం కారు చీకట్లు నింపుతోందన్నారు.

గత ప్రభుత్వం 9 సార్లు చార్జీలు పెంచగా.. తాము అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు షర్మిల. అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే.. మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా. మీకు వాళ్లకు ఏంటి తేడా అని ప్రశ్నించారు.


Tags:    

Similar News