శ్రీరెడ్డిపై కేసు పెట్టిన వైఎస్ షర్మిల.. మరికొందరు ఎవరెవరంటే?

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు

Update: 2024-02-25 10:08 GMT

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారని వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్‌ ఛానెళ్లు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఉంటున్నాయని తెలిపారు. సైబర్‌క్రైమ్‌ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మేదరమెట్ల కిరణ్‌కుమార్‌, రమేశ్‌ బులగాకుల, పంచ్‌ ప్రభాకర్‌(అమెరికా), ఆదిత్య(ఆస్ట్రేలియా), సత్యకుమార్‌ దాసరి(చెన్నై), సేనాని, వర్రా రవీందర్‌రెడ్డి, శ్రీరెడ్డి, మహ్మద్‌ రెహ్మత్‌ పాషా తదితర వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వివరించారు.

కొందరు దురుద్దేశంతో సామాజిక మాధ్యమాల్లో తనపైనా.. తన సహచరులపై అసభ్య కామెంట్లు పెడుతున్నారని ఫిర్యాదులో తెలిపారు షర్మిల. ఇవన్నీ నిరాధారమైనవే అయినా నన్ను అవమానించేలా ఉన్నాయని అన్నారు. తనకు వ్యతిరేకంగా కొన్ని పీడీఎఫ్‌ ఫైల్స్ ను సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ చేస్తున్నారని అన్నారు. తాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో ప్రజలను కలిసేందుకు ప్రచారం ప్రారంభించానని.. నిరాధారమైన పోస్టులతో తనను అవమానిస్తున్నారని షర్మిల అన్నారు.


Tags:    

Similar News