వైసీపీ ప్లీనరీ వేదిక ఖరారు
వచ్చే నెలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగనుంది. ఈ ప్లీనరీ భారీ ఎత్తున జరిపేందుకు పార్టీ సిద్దమవుతుంది
వచ్చే నెలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగనుంది. ఈ ప్లీనరీ భారీ ఎత్తున జరిపేందుకు పార్టీ సిద్దమవుతుంది. జులై 8,9వ తేదీల్లో వైసీపీ ప్లీనరీ జరగనుంది. గత రెండు మూడేళ్లుగా కరోనా కారణంగా వైసీపీ ప్లీనరీ జరుపులేకపోయింది. ఈ ఏడాది ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత జగన్ నిర్ణయించారు. జగన్ ఆదేశాల మేరకు ప్లీనరీ వేదికను నేతలు ఖరారు చేశారు. గుంటూరు జిల్లా పరిధిలోని నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీ జరగనుంది.
త్వరలోనే కమిటీలు....
ప్లీనరీ సమయం దగ్గర పడుతుండటంతో పార్టీ నేతలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో ప్లీనరీ నిర్వహణకు కమిటీలను నియమించున్నారు. పార్టీని ప్రారంభించి పదేళ్లు కానుండటం, ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టి మూడేళ్లు కావడంతో ఈ ప్లీనరీని ప్రతిష్టాత్మకతంగా తీసుకున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను పార్టీ సీనియర్ నేతలకు అప్పగించనున్నారు. త్వరలోనే ప్లీనరీ నిర్వహణ కమిటీల నియామకం జరగనుంది. ఎన్నికల సమయం కూడా ఇంకా రెండేళ్లే ఉండటంతో పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే దిశగా ప్లీనరీ జరగనుంది.