ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు
రాష్ట్రపతి ఎన్నికలకుద సంబంధించి వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది
రాష్ట్రపతి ఎన్నికలకుద సంబంధించి వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. ఈరోజు జరిగే నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలు హాజరుకానున్నారు. ఇప్పటి వరకూ వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ప్రకటిస్తుందన్న చర్చ జరిగింది. షరతులతో బీజేపీకి మద్దతు తెలిపే అవకాశాలున్నాయని కూడా వార్తొలొచ్చాయి. అయితే బేషరతుగా వైసీపీ అధినేత జగన్ ద్రౌపది ముర్ముకు తన పార్టీ మద్దతు ప్రకటించారు.
సామాజిక న్యాయం....
తొలిసారి భారత దేశ చరిత్రలో ఒక గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడాన్ని వైసీపీ స్వాగతించింది. అందులో మహిళలకు ప్రకటించడాన్ని హర్షించింవది. గడచిన మూడేళ్లుగా తాము కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్నామని, సామాజిక న్యాయం పాటించడం కోసమే ద్రౌపది ముర్ముకు మద్దతు తెలియజేస్తున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.