వైసీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్ అయినట్లే!!
వైసీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా
మార్చి 10న బాపట్లలోని అద్దంకిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు సిద్ధం సభను నిర్వహించబోతోంది. ఇంతకు ముందు సిద్ధం సభలు భారీ సక్సెస్ అయ్యాయి. అంతకు మించేలా అద్దంకిలో సభను నిర్వహించాలని వైసీపీ భావిస్తో ఉంది. 1.5 మిలియన్ల (15 లక్షలు) మద్దతుదారులతో భారీ సమావేశానికి పార్టీ నాయకులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
బాపట్లలోని సిద్ధం మీటింగ్‌లో ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలలో 99 శాతం నెరవేర్చామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కొత్త మేనిఫెస్టో విషయంలో సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారా అనే విషయమై ఏపీ ప్రజల్లో కాస్త క్యూరియాసిటీ నెలకొంది.
ఈవెంట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి వివరించారు. ఈసారి 1.5 మిలియన్ల (15 లక్షల) మంది ప్రజలు వస్తారని పార్టీ అంచనా వేస్తోందని అన్నారు. బాపట్లలో జరిగే సిద్దం సభను విజయవంతం చేసేందుకు అందరం కలిసి పని చేస్తున్నాం. మార్చి 10న సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి 15 లక్షల మంది పార్టీ మద్దతుదారులు హాజరవుతారని ఆశిస్తున్నాము. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద రాజకీయ సమావేశాల్లో ఇది ఒకటిగా మారబోతోందని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సమావేశానికి హాజరైన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమాల సమన్వయం, ప్రణాళిక, రవాణా, వేదిక ఏర్పాటు, ఫలహారాలు, పారిశుధ్యం వంటి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు.