గుడ్‌న్యూస్‌.. 3 నెలల గడువు పొడిగింపు

ఆధార్‌ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆధార్‌..

Update: 2023-09-11 09:30 GMT

ఆధార్‌ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆధార్‌ అప్‌డేట్‌ను ఉచితంగా చేసుకునేందుకు సెప్టెంబర్‌ 14 వరకు గడువు ఉన్న విషయం తెలిసిందే. అయితే 14వ తేదీ తర్వాత ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకున్నట్లయితే 50 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఉచిత ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువును మూడు నెలల పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆధార్‌ సంస్థ. ఇప్పుడు మరో మూడు నెలల పాటు ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వరకు చివరి తేదీ 14 సెప్టెంబర్ 2023 ఉండగా,దానిని డిసెంబర్‌ 14 వరకు పొడిగించింది. గడువు పొడిగించాలని వినియోగదారుల నుంచి విజ్ఞప్తులు అందడంతో పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. ఇప్పుడు 15 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ 14 వరకు myAadhaar పోర్టల్ ద్వారా ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.

ఎవరెవరు అప్‌డేట్‌ చేసుకోవాలి?

అయితే మరి ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలంటే ఎవరెవరు చేసుకోవాలనే అనుమానం రావచ్చు. మీరు ఆధార్‌ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు అయినట్లయితే మీరు తప్పకుండా ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేయడానికి, మీరు వెబ్ సైట్ కి వెళ్లవచ్చు . డిసెంబరు 14 వరకు ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తించుకోండి. ఆధార్ కేంద్రం నుంచి అప్ డేట్ చేసుకుంటే రూ.25 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. పోర్టల్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి, గుర్తింపు కార్డు, చిరునామా రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవడం ఎలా...?

☛ ముందుగా myaadhaar.uidai.gov.in కి వెళ్లండి.

☛ మీ ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటిపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి.

☛ అక్కడ ఈ పోర్టల్‌కి లాగిన్ చేసి, ‘పేరు/లింగం/పుట్టిన తేదీ, చిరునామాను అప్‌డేట్‌ చేసుకునే ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.

☛ దీని తర్వాత మీరు ‘ఆధార్ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయి’పై క్లిక్ చేయాలి.

☛ జనాభా ఎంపికల జాబితా నుండి ‘చిరునామా’ను ఎంచుకుని, ‘ఆధార్‌ను నవీకరించడానికి కొనసాగండి’పై క్లిక్ చేయండి.

☛ స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేసి, అవసరమైన జనాభా సమాచారాన్ని నమోదు చేయండి.

☛ SRN సంఖ్య జనరేట్‌ అవుతుంది. దానిని ట్రాకింగ్ కోసం ఉంచండి.

☛ ధృవీకరణ తర్వాత, మీ ఆధార్ అప్‌డేట్ చేయబడుతుంది. అలాగే మీరు మొబైల్‌ నంబర్‌కు SMS వస్తుంది.

☛ ఏ సమస్య ఉన్నా కాల్ చేయండి:

☛ మీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లేదా అప్‌డేట్ స్థితి, PVC కార్డ్ స్థితి గురించి ఏదైనా సమాచారం కోసం లేదా SMS ద్వారా సమాచారాన్ని పొందడానికి, నివాసితులు యూఐడీఏఐ టోల్-ఫ్రీ నంబర్, 1947, 24కు కాల్ చేయవచ్చు.


Tags:    

Similar News