Amitabh Bachchan: అయోధ్యలో లగ్జరీ ప్లాట్ కొనుగోలు చేసిన బిగ్ బీ.. ధర ఎంతో తెలుసా?

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ.. అమితాబ్ బచ్చన్‌.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో ఇప్పటి;

Update: 2024-01-15 12:30 GMT
Amitabh Bachchan

Amitabh Bachchan

  • whatsapp icon

Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ.. అమితాబ్ బచ్చన్‌.. ఈ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు సినిమాల్లోనూ, టీవీ షోల్లోనూ పాపులర్.. బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పుడు అయోధ్యలోని సెవెన్ స్టార్ ఎంక్లేవ్‌లో ప్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తులు వస్తున్నాయి. అయితే ఈ నెల 22న అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టపన జరుగనున్న విషయం తెలిసిందే. నేపథ్యంలో అమితాబ్ ఈ ప్లాట్ కొనుగోలు చేసినట్లు వార్తలు రావడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ముంబై కేంద్రంగా పని చేస్తున్న రియాల్టీ డెవలపర్ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (హెచ్ఓఏబీఎల్) వద్ద బిగ్ బీ ఈ ప్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఆ ప్లాట్ విలువ ఎంత, సైజ్ ఎంత సంగతి మాత్రం వెల్లడించలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైన వార్త ప్రకారం.. ప్లాట్ విస్తీర్ణం సుమారు 10 వేల చదరపు అడుగులు ఉంటుందని, దాని విలువ రూ.14.5 కోట్లు ఉండవచ్చని చెబుతున్నారు.

వచ్చే సోమవారం అంటే జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రాణప్రతిష్ట జరిగే రోజే సరయు నది ఒడ్డున 51 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ ఎంక్లేవ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. రామాలయానికి 15 నిమిషాలు, అయోధ్య వాల్మికీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల్లో వెళ్లేంత దూరంలోనే ఈ ఎంక్లేవ్ ఉందని తెలుస్తోంది. 2028 మార్చికల్లా పూర్తయ్యే ఈ ఎంక్లేవ్‌లో ఓ ఫైవ్ స్టార్ ప్యాలెస్ హోటల్ కూడా ఉంటుందని రియల్‌ ఎస్టేట్‌ వర్గీలు చెబుతున్నాయి.

Tags:    

Similar News