నవంబర్‌లో బ్యాంకులకు భారీగా సెలవులు

ఇక అక్టోబర్‌ నెల ముగియనుంది. నవంబర్‌ నెల రాబోతోంది. ముఖ్యంగా కొత్త నెల వచ్చిందంటే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు

Update: 2023-10-31 00:30 GMT

ఇక అక్టోబర్‌ నెల ముగియనుంది. నవంబర్‌ నెల రాబోతోంది. ముఖ్యంగా కొత్త నెల వచ్చిందంటే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయోననే విషయాన్ని ముందస్తుగా గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి రోజు బ్యాంకు పని నిమిత్తం వెళ్లేవారు చాలా మంది ఉంటారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. బ్యాంకులకు నవంబర్, 2023లో 12 రోజుల పాటు బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం.. నవంబర్‌ నెలలో బ్యాంకులకు ఏయే రోజులలో సెలవులు ఉంటాయో చూద్దాం.

నవంబర్‌ నెలలో బ్యాంకులకు సెలవులు:

➦ నవంబర్ 1 – బుధవారం కరక చతుర్థి. ఈ రోజును జరుపుకోవడానికి ఇండియాలో బ్యాంకులన్ని మూసి ఉంటాయి.

➦ నవంబర్ 5 – ఆదివారం

➦ నవంబర్ 10 – శుక్రవారం (వంగ పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకు సెలవు)

➦ నవంబర్ 11 – రెండవ శనివారం

➦ నవంబర్ 12 – ఆదివారం (దీపావళి కూడా)

➦ నవంబర్ 13 – సోమవారం, గోవర్ధన్ పూజ (ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, ఢిల్లీలో బ్యాంకు సెలవు)

➦ నవంబర్ 15 – బుధవారం, భాయ్ దూజ్ (దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు)

➦ నవంబర్ 19 – ఆదివారం

➦ నవంబర్ 24 – శుక్రవారం, లచిత్ దివాస్ (అస్సాంలో బ్యాంకు సెలవు)

➦ నవంబర్ 25 – నాల్గవ శనివారం

➦ నవంబర్ 26 – ఆదివారం

➦ నవంబర్ 27 – సోమవారం, గురునానక్ పుట్టినరోజు (పంజాబ్, చండీగఢ్‌లో బ్యాంకు సెలవు).

Tags:    

Similar News