దిగొస్తున్న బంగారం.. కొనడానికి ఆసక్తి!!
బంగారం ధరలు దిగొస్తూ ఉండడంతో ప్రజలు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు
బంగారం ధరలు దిగొస్తూ ఉండడంతో ప్రజలు కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వెళ్లగా.. నిన్న, నేడు కాస్త తగ్గాయి. రెండు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 మేరకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 550 మేర తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,250 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,350 పలుకుతోంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 73,200 పలుకుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 73,200 గా నమోదైంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 67,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 73,200 ఉంది.
వెండి గత 2 రోజుల్లో రూ. 1000 మేరకు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి 99000 పలుకుతోంది. బెంగళూరులో కిలో వెండి రూ. 93900గా నమోదైంది. ముంబై లో రూ. 94,500గా కిలో వెండి ధర ఉంది.