Gold Price Today : అనుకున్నదే జరిగిందిగా.. బంగారం ధరలు పెరిగాయిగా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం అందుకు భిన్నంగా స్వల్పంగా తగ్గాయి
పండగ సీజన్ ప్రారంభమయింది. ముహూర్తాలు కూడా వచ్చేశాయి. దీంతో బంగారం ధరలు పెరుగుతాయని ముందు నుంచి వేసుకున్న అంచనాలు నిజమవుతున్నాయి. రానున్న రెండు రోజుల పాటు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తుండటంతో ఇక బంగారం ధరలు పెరగడమే తప్పించి భారీగా తగ్గడం అనేది జరగదన్నది మార్కెట్ నిపుణుల అంచనా. కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ తగ్గించిన కొద్ది రోజులు తగ్గిన బంగారం తర్వాత తిరిగి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ప్రతి రోజూ పరుగులు తీస్తుంది. తగ్గినట్లే కనిపిస్తున్నా అది తగ్గనట్లే. కానీ బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికల మేరకు కొనుగోలుదారులు ఇప్పుడే కొనేయడం మంచిదంటున్నారు.
అదనపు ఛార్జీలు...
ఇక బంగారం ధరలు ఎంత పెరుగుతున్నా సరే డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. మామూలు ధరలకు తోడు దుకాణాల యజమానులు వేసే అనేక రకాల పన్నుల మోతతో బంగారం మరింత భారం అవుతుంది. ఒక్కో షోరూంను లక్షలు పోసి ఏర్పాటుచేసుకుంటారు. డెకరేషన్, నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలు ఇవన్నీ ఏదో రూపంలో మన బంగారంపై పడతాయన్నది తెలుసు. దీంతో పాటు జీఎస్టీ అదనపు వసూలుతో వినియోగదారులకు జేబుల చిల్లు పడినట్లే. ఇలా బంగారం ధర ఒకలా ఉంటే .. తరుగు, పన్నుల రూపంలో మరింత వసూలు చేస్తున్నారు. అయినా సరే భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం కొనుగోలు చేయాల్సి రావడంతో పసిడికి గిరాకీ ఏమాత్రం తగ్గలేదు.
పెరిగిన బంగారం ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం అందుకు భిన్నంగా స్వల్పంగా తగ్గాయి. అయితే ఈ ధరలు ఉదయం ఆరు గంటల వరకూ మాత్రమే ఉంటాయి. మధ్యాహ్నానికి ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు. స్థిరంగా కొనసాగవచ్చు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బంగారం కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంధర 71,010 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 76,890 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 94,900 వద్ద ట్రెండ్ అవుతుంది.