రెండో రోజూ మంచి వార్తే

ఈరోజు దేశంలో బంగారం ధరలు రెండో రోజూ తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి;

Update: 2023-09-28 03:19 GMT

బంగారం అంటే అంతే మరి. ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. పెరుగుతుందో కూడా తెలియదు. అందుకే తగ్గినప్పుడే కొనుగోలు చేయాలి. పెరుగుతున్న బంగారం ధరలు మధ్య తరగతి ప్రజలను దానికి దూరం చేస్తున్నాయి. శుభకార్యక్రమాల్లో ఎక్కువగా బంగారాన్ని వాడటం భారతీయ సంస్కృతిలో భాగం. అందుకే దేశంలో ఇతర ప్రాంతాల కన్నా దక్షిణ భారత దేశంలోనే బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇతర దేశాలలో మాదిరిగా గోల్డ్ బాండ్స్ ను కొనుగోలు చేయడం తక్కువ. అసలు గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయడం కూడా ఇక్కడ దక్షిణ భారతీయులకు అలవాటు లేదు. అందుకే బంగారు ఆభరణాలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.

తగ్గిన ధరలు...
ఈరోజు దేశంలో బంగారం ధరలు రెండో రోజూ తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై 280 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై రూ.600లు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,500 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,450 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్ లో 77,000 రూపాయలుగా ఉంది.


Tags:    

Similar News