వీసా, పాస్‌పోర్ట్ లేకుండా దేశంలోని ఈ రైల్వే స్టేషన్‌లో అనుమతి ఉండదు
విదేశాలకు వెళ్లినప్పుడల్లా వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి అవసరమని మనందరికి తెలిసిందే. ఇవి లేనిది ఏ దేశాలు వెళ్లడం కుదరదు. మీరు వేరే దేశానికి ..
విదేశాలకు వెళ్లినప్పుడల్లా వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి అవసరమని మనందరికి తెలిసిందే. ఇవి లేనిది ఏ దేశాలు వెళ్లడం కుదరదు. మీరు వేరే దేశానికి ఎలా వెళ్లినా, వీసా-పాస్‌పోర్ట్ లేకుండా ప్రవేశం అందుబాటులో ఉండదు. మన భారతదేశంలో ప్రయాణిస్తున్నప్పుడు అవి అవసరం లేదు. కానీ వీసా, పాస్‌పోర్ట్ కలిగి ఉండటం, రైలు ప్రయాణం చేయడం కోసం భారతదేశంలో రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలియకపోవచ్చు. అలాంటి రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలుసుకుందాం..
మనం మాట్లాడుకుంటున్న రైల్వే స్టేషన్ పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఉంది. దాని పేరు అట్టారీ రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు రైళ్లు నడుస్తుంటాయి. దేశంలో పాస్‌పోర్ట్, వీసా రెండూ అవసరమయ్యే ఏకైక రైల్వే స్టేషన్ ఇదే. ఈ రెండు పత్రాలు లేకుండా ఈ స్టేషన్‌లో రైలు ఎక్కేందుకు ఏ మాత్రం కుదరదు. పాస్‌పోర్ట్, వీసా లేకుండా ఇక్కడ పట్టుబడితే మీరు నేరుగా జైలుకు వెళ్లవచ్చు. సమస్య భారత్-పాకిస్తాన్ ప్రయాణానికి సంబంధించినది కాబట్టి, ఇక్కడ చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంది. అందుకే నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఇందులో ఏ మాత్రం సడలింపులు ఉండవు. ముందు మనకు శత్రు దేశమైన పాకిస్థాన్ కాబట్టి నిబంధనలు మరింత కఠినంగానే ఉంటాయి.
వీసా-పాస్‌పోర్ట్ లేకుంటే కేసు నమోదు
అట్టారీ రైల్వే స్టేషన్‌లో వీసా, పాస్‌పోర్ట్ లేకుండా పట్టుబడినట్లయితే 14వ విదేశీ చట్టం అంటే వీసా లేకుండా అంతర్జాతీయ భూభాగంలో పట్టుబడిన కేసు నమోదు చేస్తారు పోలీసులు. ఇంకో విషయంలో ఏంటంటే వీసా, పాస్‌పోర్ట్ లేకుండా ఈ కేసులో పట్టుబడినట్లయితే బెయిల్ తెచ్చుకునేందుకు చాలా ఏళ్లు పడుదుంట. ఎందుకే ఈ స్టేషన్‌కు వెళ్లి రైలు ప్రయాణం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు.. ఇక్కడ వెళ్లిన ప్రయాణికులపై పోలీసులకు ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే వారిని పట్టుకుని విచారణ చేపడతారు. ఒక వేళ ప్రయాణికుల్లో ఎలాంటి తప్పు లేకున్నా అక్కడ అనుమానస్పదంగా ఉండకూడదు. అలా ఉన్నా.. పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ స్టేషన్‌లో ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో భద్రత ఉంటుంది.
ఈ స్టేషన్ నుంచి ఏ రైళ్లు నడుస్తాయి?
ఢిల్లీ లేదా అమృత్‌సర్ నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్లే రైళ్లు అట్టారీ స్టేషన్ ద్వారా మాత్రమే వెళతాయి. పౌరుల కోసం ఎప్పటికప్పుడు రెండు దేశాల మధ్య రైళ్లు నడుపుతున్నారు. వాటిలో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి. అయితే గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌తో సంబంధాలు క్షీణించడంతో రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి. ఈ రైల్వే స్టేషన్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిఘా సంస్థ కన్ను ఇక్కడ 24x7 ఉంటుంది. అలాగే ఈ రైల్వే స్టేషన్‌లో చాలా సినిమాల చిత్రీకరణ కూడా జరిగింది. అయితే అట్టారి రైల్వే స్టేషన్ చాలా సున్నితమైన ప్రదేశంలో ఉంది. ఎందుకంటే ఇది పాకిస్తాన్‌తో తక్షణ సరిహద్దు ప్రాంతం . ఇది భారతదేశం, పాకిస్తాన్‌లకు ప్రవేశ నిష్క్రమణ పాయింట్‌లలో ఒకటి. అందుకే ఈ స్టేషన్‌ను సందర్శించడానికి చెల్లుబాటు అయ్యే వీసా, పాస్‌పోర్ట్ తప్పనిసరి.