పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరని రైతులకు గుడ్‌న్యూస్.. ఇలా చేస్తే ఖాతాల్లో డబ్బులు
మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆర్థికంగా ఆసరా ఉండేందుకు వివిధ పథకాలతో పాటు పీఎం కిసాన్..;
మోడీ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆర్థికంగా ఆసరా ఉండేందుకు వివిధ పథకాలతో పాటు పీఎం కిసాన్ సమ్మాన్ యోజన స్కీన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసింది. ఈ పథకంలో ఏడాదికి రూ.6000 చొప్పున మూడు విడతల్లో రెండేసి వేలు రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. ఇక మోడీ ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా రైతులకు 2000 రూపాయల వాయిదాను రైతుల ఖాతాల్లోకి బదిలీ చేసింది. మీరు కూడా రైతు అయి ఉండి, PM కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్నట్లయితే మీ కోసం ఓ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వం 15వ విడత డబ్బును రైతులకు బదిలీ చేయబోతోంది. అయితే మీకు కూడా 15వ విడతలో రూ. 2000 కావాలంటే, దీని కోసం మీరు 3 పనులు చేయాలి. మీరు ఈ 3 పనులు చేయకపోతే తదుపరి వాయిదాకు మీకు డబ్బు రాదు.
15వ విడత రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది
పీఎం కిసాన్ యోజన 15వ విడత కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే ఏ రైతు అయినా మీ సేవ కేంద్రాన్ని సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. pmkisan.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ యోజన 15వ విడతకు ముందు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు 3 పనులు చేయాల్సి ఉంది.
>> రైతులు తమ భూమి పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
>> ఇది కాకుండా, మీ ఆధార్‌ను యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం అవసరం.
>> రైతులు తమ e-KYCని పొందడం కూడా అవసరం.
14వ విడత డబ్బును జూలై 27న బదిలీ
నవంబర్-డిసెంబర్ 2023 మధ్య, 15వ విడత సొమ్మును కేంద్ర ప్రభుత్వం రైతులకు బదిలీ చేసింది. జూలై 27న ప్రభుత్వం 14వ విడత సొమ్మును రైతులకు బదిలీ చేసింది. 14వ విడతగా 17 వేల కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
ఈ నంబర్లలో సంప్రదించవచ్చు
మీ ఖాతాలో 14వ వాయిదా డబ్బు ఇంకా రాకపోతే మీరు హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 1800115526 లేదా ఈ నంబర్‌లో 011-23381092ను సంప్రదించవచ్చు. ఇది కాకుండా, pmkisan-ict@gov.in కు ఇమెయిల్ పంపడం ద్వారా కూడా మీరు మీ సమస్యను తెలియజేయవచ్చు .